BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 April 2026, 05:21 pm
Posted by : సిర మహేష్

బీటీ రణదీవే స్ఫూర్తితో కార్మిక పోరాటాలు నిర్మించాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట / బీబీనగర్
Reporter
సిర మహేష్ రామన్నపేట మండల ప్రతినిధి
06 Apr, 2026 - 05:21 PM
128 వీక్షణలు

సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి గొరిగె సోములు

భారత కార్మిక ఉద్యమ నాయకుడు బిటి రణదీవే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం అవలంబించే కార్మిక వ్యతిరేక విధానాలపై సంఘటిత ఉద్యమాలు నిర్మించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి గోరిగె సోములు పిలుపునిచ్చారు. స్థానిక సిఐటియు మండల కార్యాలయంలో భారత కార్మిక ఉద్యమ నాయకులు,సిఐటియు మొదటి అఖిలభారత అధ్యక్షులు బిటి రణదీవే 36వ వర్ధంతి సందర్భంగా మండల కమిటీ ఆధ్వర్యంలో పూలమాలవేసి చిత్రపటానికి జోహార్లు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల జీవితాలతో ఆటలాడుతోందని ఏప్రిల్ ఒకటి నుండి లేబర్ కోడ్లు అమలవుతున్నాయని కార్మికులపై పెను భారాలు మోపుతున్నాయని అన్నారు. చేసిన పనికి కనీస వేతనాలు రాకుండా, సంఘాలు పెట్టుకోకుండా పోరాడి సాధించుకున్న చట్టాలను నిర్వీర్యం చేస్తూ మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఎర్రతివాచీలు పరుస్తుందని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా కార్మిక లోకమంతా రోడ్లమీద కొచ్చి సమ్మె నిర్వహించి నిరసన తెలిపిన ప్రభుత్వంలో చలనం లేదని కార్మిక వ్యతిరేక చట్టాలపై స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బీటీ రణదీవే స్ఫూర్తితో క్షేత్రస్థాయిలో కార్మికులను ఏకం చేసి సిఐటియు పోరాడుతుందని ఈ పోరాటంలో కార్మికులంతా కలిసి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నకిరేకంటి రాము, సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు బొడ్డుపల్లి వెంకటేశం, భవణ  నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు వంగాల మారయ్య, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు గంటెపాక శివకుమార్,స్వామి తదితరులు పాల్గొన్నారు.