BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 March 2026, 10:48 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

భద్రాద్రి రామయ్య గోత్ర వివాదం.. నేడు హైకోర్టులో కీలక విచారణ

తెలంగాణ
/ భద్రాద్రి కొత్తగూడెం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 10:48 PM
138 వీక్షణలు

భద్రాద్రి రామయ్య గోత్ర వివాదం.. నేడు హైకోర్టులో కీలక విచారణ

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామయ్య గోత్రంపై నెలకొన్న వివాదం హైకోర్టుకు చేరిన విషయం తెలిసిందే. ఈ అంశంపై నేడు హైకోర్టులో కీలక విచారణ జరగనుంది.

ఇప్పటివరకు ఆలయంలో సంప్రదాయంగా స్వామిని వశిష్ఠ గోత్రికుడిగా, సీతమ్మను గౌతమ గోత్రంగా పూజించేవారు. అయితే 2012 తర్వాత కొంతమంది పండితులు స్వామిని “అచ్యుత”, అమ్మవారిని “సౌభాగ్య” గోత్రాలుగా పేర్కొంటూ పూజలు నిర్వహించడం ప్రారంభించారు.

ఈ మార్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ 2022లో ఓ భక్తుడు కోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు నియమించిన కమిటీ పరిశీలన జరిపి దేవాదాయ శాఖకు నివేదిక సమర్పించింది. అయితే ఆ నివేదికను ప్రజలకు వెల్లడించకపోవడంతో, సంబంధిత భక్తుడు మళ్లీ కోర్టును ఆశ్రయించారు.

భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న ఈ సున్నిత అంశంపై నేడు జరగనున్న విచారణలో కోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తికరంగా మారింది.