BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 05 March 2026, 09:12 am
Posted by : NTODAY NEWS OFFICIAL

నిత్యకళారాధనలో భాగంగా భక్తిరంజని కార్యక్రమం

తెలంగాణ
05 Mar, 2026 - 09:12 AM
397 వీక్షణలు
శ్రీశైలంలో నిత్యకళారాధనలో భాగంగా భక్తిరంజని కార్యక్రమం NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్మపథం కార్యక్రమంలో భాగంగా నిత్యకళారాధన కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 05.03.2026న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీ ఆచంట లక్ష్మీ శ్రీనివాస నామ సంకీర్తన బృందం ఆధ్వర్యంలో భక్తిరంజని కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుంచి ప్రారంభమైంది. కార్యక్రమంలో గణపతి ప్రార్థన, ఓంకారనాదం, కైలాసపతే సదాశివ, చంద్రశేఖరాయ నమ, గిరిజారమణ దురిత నివారణ, శివ శివ భవభవ వంటి పలు శివకీర్తనలను ఎ. లక్ష్మీ శ్రీనివాస్ ఆలపించారు. సహకార గాయకులుగా రాంబాబు, రమణ, ప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమానికి హార్మోనియంపై ప్రసాద్, డోలక్‌పై దొరబాబు సంగీత సహకారం అందించారు. దేవస్థానం నిర్వహిస్తున్న నిత్యకళారాధన కార్యక్రమంలో ప్రతిరోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీ స్వామి, అమ్మవార్లకు కైంకర్యాలు పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణ కోసం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. (కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు శ్రీశైల దేవస్థానం ద్వారా జారీ చేసిన ప్రకటన) #Srisailam #NithyaKalaradhana #BhaktiRanJani #SpiritualPrograms #TempleCulture #AndhraPradeshTemples #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube