BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 05 February 2026, 06:05 am
Posted by : NTODAY NEWS OFFICIAL

జగిత్యాల వార్డులో బీఆర్ఎస్ ఇంటింటా ప్రచారం

తెలంగాణ
05 Feb, 2026 - 06:05 AM
302 వీక్షణలు
జగిత్యాల 3వ వార్డులో బీఆర్ఎస్ ఇంటింటా ప్రచారం గుమ్మడి సత్యం గౌడ్‌కు మహిళల మద్దతు NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ జగిత్యాల పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ జోరు కొనసాగుతోంది. పట్టణంలోని 3వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గుమ్మడి సత్యం గౌడ్ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముమ్మరంగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తొలి జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ పాల్గొన్నారు. ప్రచారం సందర్భంగా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి, అభ్యర్థికి మద్దతు తెలిపారు. ప్రజల్లో కేసీఆర్‌కు నిలకడైన మద్దతు ఈ సందర్భంగా దావ వసంత మాట్లాడుతూ, ఏ ఇంటి గడప తొక్కినా ప్రజల్లో కల్వకుంట్ల చంద్రశేఖర రావు పట్ల ఉన్న అభిమానం తగ్గలేదని స్పష్టమవుతోందన్నారు. సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థిరమైన స్థానం సంపాదించుకున్నారని, లబ్ధిదారులు స్వచ్ఛందంగా కారు గుర్తుకే మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలపై విమర్శ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చిందని ఆమె విమర్శించారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ తీరును ప్రజలు గమనిస్తున్నారని, మళ్లీ చేయి గుర్తుకు ఓటు వేస్తే మోసపోవడం తప్పదని హెచ్చరించారు. పట్టణ అభివృద్ధి బీఆర్ఎస్‌తోనే సాధ్యమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్‌తో పాటు పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #Jagityal #BRSCampaign #MunicipalElections #KCR #GrassrootsPolitics #TelanganaPolitics Follow us on Website Facebook Instagram YouTube