BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 01 September 2026, 04:50 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి: ఏవో బి. శివశంకర్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Sep, 2026 - 04:50 PM
111 వీక్షణలు

ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన.. కోడిగుడ్డు ద్రావణం తయారీ ప్రదర్శన

ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో భాగంగా కోడిగుడ్డు–నిమ్మరసం ద్రావణం తయారీ విధానాన్ని రైతులకు స్వయంగా చేసి చూపించారు. ఈ ద్రావణం వినియోగం ద్వారా పంటల్లో సూక్ష్మ పోషకాల లోపాలను అధిగమించి, పంటలను ఆరోగ్యంగా కాపాడుకోవచ్చని వివరించారు.

చాట్రాయి మండల పరిధిలోని వరి, ప్రత్తి, మినుము, ఆయిల్‌ఫామ్, మామిడి తదితర పంటలను రైతులు తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాలని ఏవో బి. శివశంకర్ సూచించారు. సెప్టెంబర్ 15వ తేదీలోపు పంట నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని తెలిపారు.

పంట నమోదు చేసుకోవడం వల్ల రైతులకు ప్రభుత్వం అందించే కనీస మద్దతు ధరతో ధాన్యం విక్రయ సౌకర్యం, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలకు పరిహారం, పంట బీమా, కౌలు రైతులకు సబ్సిడీలు, వ్యవసాయ యంత్ర పరికరాలపై రాయితీలు పొందే అవకాశం ఉంటుందని వివరించారు.

ప్రతి రైతు ఏపీఎఫ్‌ఆర్ ద్వారా విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందాలని, ఆ సంఖ్యను రైతు పొలంతో అనుసంధానం చేయడం వల్ల పంట బీమా, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు, పీఎం కిసాన్ వంటి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు.

ఎల్‌నినో ప్రభావం కారణంగా రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు. తక్కువ నీటితో పంటల సాగు, వర్షపు నీటి సంరక్షణ, ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని కోరారు.

కోడిగుడ్డు–బెల్లం ద్రావణం, జీవామృతం, ఘన జీవామృతం వంటి ప్రకృతి వ్యవసాయ విధానాలను పాటించడం ద్వారా పంటలకు పోషకాలు అందడంతో పాటు నీటి ఎద్దడిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుందని రైతులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.