BREAKING
thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
Date of Publish : 31 July 2026, 08:58 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చీపురుగూడెంలో మాజీ నీటి సంఘం అధ్యక్షుడు మందలపు ప్రసాద్‌కు పరామర్శలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Jul, 2026 - 08:58 PM
146 వీక్షణలు

చాట్రాయి, జూలై 31: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చీపురుగూడెం గ్రామానికి చెందిన మాజీ నీటి సంఘం అధ్యక్షుడు, "ఉత్తమ నీటి సంఘం" నాయకుడిగా అవార్డు అందుకున్న మందలపు ప్రసాద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆక్సిజన్ సిలిండర్ల సహాయంతో ఇంటి వద్దే చికిత్స పొందుతున్నట్లు తెలిసి డి. హరినాథ్, డి. పుల్లారావు శుక్రవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.

ఈ సందర్భంగా కోటపాడులో ఐపీఎఫ్–సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ఆధ్వర్యంలో జరిగిన చారిత్రాత్మక రైతాంగ ఉద్యమంలో కలిసి పనిచేసిన రోజుల జ్ఞాపకాలను ప్రసాద్ గుర్తు చేసుకున్నారు. తన కుమారుడు జగదీష్‌కు హరినాథ్‌ను పరిచయం చేస్తూ ఆనాటి ఉద్యమ విశేషాలను కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. అదే సమయంలో హరినాథ్ ఆరోగ్యం గురించి ఆరా తీసి జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

మందలపు ప్రసాద్ క్యాన్సర్‌తో కూడా బాధపడుతున్నట్లు తెలిసింది. ఇటీవలే ఆయన భార్య మృతి చెందడంతో కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. జీవితాంతం వ్యవసాయానికే అంకితమైన రైతు ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో పరామర్శకు వచ్చిన వారిని ఆ దృశ్యం కలచివేసింది.

మందలపు ప్రసాద్ ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షిస్తూ బంధువులు, స్నేహితులు, రైతు సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు వరుసగా ఆయనను పరామర్శిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు.