BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 21 March 2026, 04:38 pm
Posted by : కూనురు మధు

చిట్యాలలో ఘనంగా ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
21 Mar, 2026 - 04:38 PM
493 వీక్షణలు

​​చిట్యాలలో ఘనంగా ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) వేడుకలు 

ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

నెల రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో పాటించిన ఉపవాస దీక్షలు విరమిస్తూ, క్రమశిక్షణకు, దాతృత్వానికి ప్రతీకగా నిలిచే రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగను చిట్యాలలో ముస్లిం సోదరులు ఎంతో వేడుకగా జరుపుకున్నారు. శనివారం స్థానిక ఈద్గా వద్ద ముస్లింలు సామూహిక ప్రార్థనలు నిర్వహించి, ఒకరికొకరు ‘ఈద్ ముబారక్’ చెప్పుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ​ఈ సందర్భంగా పలువురు నాయకులు ఈద్గాను సందర్శించి, ముస్లిం సోదరులను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రంజాన్ పండుగ మానవతా విలువలను, పేదరికం పట్ల సానుభూతిని పెంచుతుందని కొనియాడారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఉండాలని, ఈ పండుగ అందరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలని వారు ఆకాంక్షించారు.​ఈ కార్యక్రమంలో    జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్ ,  కౌన్సిలర్లు ​కోనేటి ఎల్లయ్య, ​జేరిపోతుల సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు ​పందిరి రమేష్, గుండెబోయిన సైదులు, చేపూరి యాదయ్య, ​ఎద్దుల పూరి కృష్ణ, ​దేశపాక రాజేష్, ​సిలువేరు శేఖర్, దామనూరి అశోక్, బూరుగు కృష్ణయ్య, కొసనం అశోక్,  ​దాసరి నరసింహ ఏనుగు నరసింహారెడ్డి, తరతరాలు పాల్గొన్నారు.