BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 09 January 2026, 09:15 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ప్రమాద బాధిత కుటుంబాలకు సీఎం సహాయ నిధి

తెలంగాణ
09 Jan, 2026 - 09:15 AM
281 వీక్షణలు

కొండగట్టు అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం NTODAY NEWS: జగిత్యాల జిల్లా, మల్యాల మండలం, కొండగట్టు మల్యాల మండలం ముత్యంపేటలో ఇటీవల కొండగట్టులో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.83 లక్షల చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు పాల్గొని బాధితులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, లక్షలాది రూపాయలు అప్పులు చేసి సామాగ్రి తెచ్చుకున్న దుకాణదారులు అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన దుస్థితిని చూసి ప్రభుత్వం వెంటనే స్పందించిందన్నారు. ప్రమాద ఘటనను తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, జిల్లా అధికారుల ద్వారా సమగ్ర నివేదిక సమర్పించినట్లు తెలిపారు. బాధితులను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి నుంచి రూ.83,12,000, విద్యుత్ సంస్థ నుంచి రూ.29 లక్షలు, డీఆర్‌డీఓ ద్వారా మరో రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించామని చెప్పారు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులు మళ్లీ వ్యాపారం ప్రారంభించుకునేలా ప్రభుత్వం భవిష్యత్తులో కూడా పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. అదేవిధంగా కొండగట్టు, ధర్మపురి, కోటిలింగాల, రాజరాజేశ్వర స్వామి దేవాలయ ప్రాంతాలను టెంపుల్ సిటీ కారిడార్‌గా అభివృద్ధి చేస్తామని, కొండగట్టు గిరి ప్రదక్షిణ మార్గం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని మంత్రి తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube