BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 24 February 2026, 08:59 am
Posted by : NTODAY NEWS OFFICIAL

స్వచ్ఛ ధర్మపురి – స్వచ్ఛ గోదావరి కార్యక్రమం

తెలంగాణ
24 Feb, 2026 - 08:59 AM
277 వీక్షణలు
‘స్వచ్ఛ ధర్మపురి – స్వచ్ఛ గోదావరి’ కార్యక్రమానికి శ్రీకారం NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ ధర్మపురి: గోదావరి నది స్వచ్ఛత పరిరక్షణ లక్ష్యంగా ధర్మపురి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘స్వచ్ఛ ధర్మపురి – స్వచ్ఛ గోదావరి’ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. గోదావరి తీరంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా సహకారం: గోదావరి పరిశుభ్రత కోసం అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. పుష్కరాల సన్నద్ధత: 2027 జూన్‌లో జరగనున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 27న కన్సల్టెన్సీ ప్రతినిధులు ధర్మపురిని సందర్శించనున్నట్లు వెల్లడించారు. భక్తులకు విజ్ఞప్తి: నదిలో పాత బట్టలు, ఇతర వస్తువులు వేయకుండా నిర్దేశిత ప్రదేశాల్లోనే వేయాలని కోరారు. పెండింగ్ పనుల పరిష్కారం: పట్టణంలో నిలిచిపోయిన డ్రైనేజీ పనులు, డంపింగ్ యార్డ్ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ చైర్మన్ నాగలక్ష్మి మాట్లాడుతూ, పరిశుభ్రత కార్యక్రమాన్ని ఏడాది పొడవునా కొనసాగిస్తామని తెలిపారు. పట్టణ అభివృద్ధికి సంబంధించి ప్రజలు, అగ్రహారం పెద్దలు, వివిధ పార్టీల నాయకులు తమ సూచనలు అందించాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రామన్న, ఆలయ కమిటీ చైర్మన్ జక్కు రవీందర్, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. #Dharmapuri #SwachhDharmapuri #SwachhGodavari #GodavariRiver #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube