BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 February 2026, 09:38 am
Posted by : NTODAY NEWS OFFICIAL

రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు

తెలంగాణ
23 Feb, 2026 - 09:38 AM
290 వీక్షణలు
రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు: కలెక్టర్ సత్యప్రసాద్ NTODAY NEWS: జగిత్యాల జగిత్యాల: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, జిల్లా రహదారి భద్రత కమిటీ (DRSC) చైర్మన్ బి. సత్యప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి నిర్వహించిన రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాన ఆదేశాలు: ట్రాఫిక్ సిగ్నల్స్, సీసీ కెమెరాలు జగిత్యాల పట్టణంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ పనితీరును మెరుగుపరచాలని సూచించారు. మరమ్మత్తులు చేపట్టని ఏజెన్సీలకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. బస్టాండ్ ఆవరణ, పార్కింగ్ ప్రాంతాల్లో అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. బ్లాక్ స్పాట్ల అభివృద్ధి జిల్లాలో గుర్తించిన 8 బ్లాక్ స్పాట్లపై ఆర్&బి శాఖ సమీక్ష నిర్వహించింది. రాయపట్నం–కోదాడ రోడ్డుకు రూ.23 లక్షలు చైతన్య పాఠశాల సమీప పనులకు రూ.21.50 లక్షలు మెట్పల్లి–రంగారావుపేట రోడ్డుకు రూ.12 లక్షల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు ఆక్రమణల తొలగింపు కొండగట్టు ప్రాంతంలో బీటీ రోడ్డుకు ఆనుకుని ఉన్న ఆక్రమణలను తొలగించాలని ఎన్‌హెచ్ అధికారులను ఆదేశించారు. ప్రమాదాలకు కారణమవుతున్న ఎత్తైన బెర్మ్‌లను తొలగించాలని సూచించారు. మౌలిక సదుపాయాల మెరుగుదల మంచినీళ్ల బావి సమీపంలో లైట్లు, విద్యుత్ స్తంభాల మరమ్మత్తులు చేపట్టాలి. వెల్గటూర్ వంతెనపై భద్రతా పనులు పూర్తి చేయాలి. గొల్లపల్లి బైపాస్ రోడ్డులో గుంతలను తక్షణమే పూడ్చాలి. అత్యవసర వైద్యం ప్రమాదాల సమయంలో తక్షణ చికిత్స అందించేందుకు సమీప ఆసుపత్రుల్లో అంబులెన్స్‌లు సిద్ధంగా ఉండేలా చూడాలని డీఎంహెచ్‌ఓకు సూచించారు. ఇతర సూచనలు రోడ్డు పక్కన పెరిగిన పొదలు, చెట్టు కొమ్మలను తొలగించాలని, ప్రమాదకర కటింగ్ ప్రాంతాలను మొరం లేదా గ్రావెల్‌తో పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. ఎన్‌హెచ్-63, ఎన్‌హెచ్-563 రహదారులపై ప్రత్యేక నిఘా ఉంచాలని పేర్కొన్నారు. #Jagtial #RoadSafety #CollectorSatyaprasad #TrafficManagement Follow us on Website Facebook Instagram YouTube