BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 07 March 2026, 06:47 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఆడబిడ్డ పెళ్లికి కాంగ్రెస్ నాయకుల అండ

తెలంగాణ
07 Mar, 2026 - 06:47 AM
267 వీక్షణలు
ఆడబిడ్డ పెళ్లికి కాంగ్రెస్ నాయకుల అండ రూ. 30 వేల నగదు, క్వింటాల్ బియ్యం వితరణ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ కష్టాల్లో ఉన్న పేదలకు తోడుగా నిలవడంలోనే నిజమైన మానవత్వం ఉందని వెల్గటూర్ మండల కాంగ్రెస్ నాయకులు మరోసారి చాటిచెప్పారు. తల్లిదండ్రులను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ అనాథ ఆడబిడ్డ వివాహానికి తమవంతు సహాయం అందించి మానవతా దృక్పథాన్ని చూపించారు. వెల్గటూర్ మండల కేంద్రానికి చెందిన పుట్టపాక రజిత తల్లిదండ్రులను కోల్పోయి నిరుపేద స్థితిలో జీవిస్తోంది. ఆమె వివాహం నిశ్చయమైనప్పటికీ ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు ముందుకు వచ్చి సహాయం అందించారు. ఈ సందర్భంగా వార్డు సభ్యుడు, మాజీ ఉపసర్పంచ్ గుండాటి సందీప్ రెడ్డి తన వంతుగా క్వింటాల్ బియ్యం అందజేసి అండగా నిలిచారు. అదేవిధంగా స్థానిక నాయకులు మరియు దాతలు కలిసి పెళ్లి కానుకగా రూ.30,000 నగదు మరియు ఒక చీరను అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తల్లిదండ్రులు లేని రజితను తమ సొంత బిడ్డగా భావించి ఆమె వివాహం గౌరవప్రదంగా జరగాలనే ఉద్దేశంతో ఈ సహాయం అందించినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా పేద ప్రజలకు అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు గండ్ర ప్రతాప్ రావు, మాజీ సర్పంచ్ మెరుగు మురళీ గౌడ్, వార్డు సభ్యులు గుండాటి సందీప్ రెడ్డి, నక్క సురేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జూపాక ప్రవీణ్, జిల్లా యూత్ కాంగ్రెస్ సెక్రెటరీ గండ్ర శ్రీకాంత్ రావు, మండల బీసీ సెల్ అధ్యక్షుడు బందెల ఉదయ్ గౌడ్, స్థానిక నాయకులు పెద్దూరి భరత్ కుమార్, వెలగందుల సంతోష్, గుమ్ముల అజయ్, కొండ లక్ష్మీనారాయణ, లకుమల్ల సాయి తదితరులు పాల్గొన్నారు. #Velgatoor #CongressLeaders #SocialService #HelpingHand #TelanganaNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube