BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 20 March 2026, 08:17 pm
Posted by : కూనురు మధు

డబుల్ ఓట్లకు చెక్.. తప్పుల్లేని ఓటర్ల జాబితాయే లక్ష్యం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
20 Mar, 2026 - 08:17 PM
380 వీక్షణలు

డబుల్ ఓట్లకు చెక్.. తప్పుల్లేని ఓటర్ల జాబితాయే లక్ష్యం: చిట్యాల ఎమ్మార్వో 

చిట్యాల ఇన్చార్జ్ తహశీల్దార్ బి.  విజయలక్ష్మి

ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణలో రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో సహకరించాలని చిట్యాల ఇంచార్జ్  తహశీల్దార్ విజయలక్ష్మి కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఆమె ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ​ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో లోపాలను సరిదిద్దేందుకు ప్రతి రాజకీయ పార్టీ తమ తరపున ఒక ప్రతినిధిని నియమించుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఓట్ల పరిశీలన పారదర్శకంగా జరగాలంటే పార్టీల సహకారం అవసరమని ఆమె పేర్కొన్నారు  ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు హక్కు ఉన్నట్లయితే, అటువంటి వాటిని గుర్తించి చట్టపరంగా తొలగిస్తామని తెలిపారు మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించే ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను, నాయకులను కోరారు. ఓటర్ల సవరణ ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడటంలో రాజకీయ పార్టీలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.​ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.