BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 April 2026, 01:57 pm
Posted by : V శ్రీనివాస్

​దండేపల్లి మండల కేంద్రంలో ఘనంగా బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ
/ మంచిర్యాల / దండేపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
06 Apr, 2026 - 01:57 PM
112 వీక్షణలు

దండేపల్లి మండల కేంద్రంలో ఘనంగా బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో సోమవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పత్తిపాక సంతోష్ పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ.. కేవలం ఇద్దరు సభ్యులతో ప్రారంభమైన బీజేపీ ప్రయాణం, నేడు కోట్ల మంది ఆదరణతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించడం ఒక అద్భుత విజయ ప్రస్థానమని కొనియాడారు. జాతీయవాదమే పునాదిగా, ఓటమికి కుంగని ధీరత్వం మరియు గెలుపుకు పొంగని నాయకత్వంతో పార్టీ లక్ష్యం దిశగా సాగుతోందని, భారత్ నిర్మాణ కల సాకారం కావడంలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు