BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 03 January 2026, 08:29 am
Posted by : NTODAY NEWS OFFICIAL

భక్తులకు అన్నప్రసాద వితరణ

తెలంగాణ
03 Jan, 2026 - 08:29 AM
265 వీక్షణలు

ఆంజనేయ స్వామి ఆలయంలో వైభవంగా పౌర్ణమి పూజలు

భక్తులకు అన్నప్రసాద వితరణ NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ లక్ష్మణ్ వెల్గటూర్ మండల కేంద్రంలోని రామభక్త ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నోముల జలజ–వెంకటరెడ్డి దంపతుల సౌజన్యంతో ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన జలజ–వెంకటరెడ్డి దంపతులను ఆలయ కమిటీ చైర్మన్ మెరుగు నరేష్ గౌడ్ శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం స్వామివారి చిత్రపటాన్ని అందజేసి ఆశీర్వచనాలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మెరుగు మురళీ గౌడ్, ప్రముఖులు గుమ్ముల వెంకటేష్, మూగల సతీష్, రంగు అజయ్, మెరుగు ప్రవీణ్, పందిరి వెంకటేష్, మెరుగు రంజిత్, ఆలయ అర్చకులు నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై పూజల్లో పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube