BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 25 November 2025, 05:05 am
Posted by : NTODAY NEWS OFFICIAL

విభిన్న ప్రతిభావంతులు ఆత్మస్థైర్యంతో అన్నిరంగాల్లో రాణించాలి

తెలంగాణ
25 Nov, 2025 - 05:05 AM
447 వీక్షణలు
విభిన్న ప్రతిభావంతులు ఆత్మస్థైర్యంతో అన్నిరంగాల్లో రాణించాలి NTODAY NEWS: ఏలూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్ కుమార్, విభిన్న ప్రతిభావంతులు ఆత్మస్థైర్యంతో అన్నిరంగాల్లో రాణించేందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చెప్పారు. భవిష్యత్తులో వారికి ఎటువంటి అవసరం వచ్చిన అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో జిల్లాస్థాయి విభిన్న ప్రతిభావంతుల క్రీడాపోటీలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తొలుత ఆయనకి ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం క్రీడాపతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే ర్యాలీని జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో తొలుత స్విమ్మింగ్‌ విభాగంలో జాతీయ స్థాయి పతకాలు సాధించిన మాన్విత్‌ చౌదరిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించే విషయంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. దీనిలో భాగంగానే వారికి ప్రత్యేక పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. దాంతోపాటూ వారికంటూ ప్రత్యేకంగా నిధులను కేటాయించి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు పాటుపడుతున్నామన్నారు. ఇదేక్రమంలో తన ఆధ్వర్యంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ట్రైసైకిళ్ళు, వినికిడి యంత్రాలను ఉచితంగా పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమానికి నాంది పలికానన్న ఆయన,,, ఆ లక్ష్యాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నానని స్పష్టం చేశారు. అనంతరం ట్రైసైకిళ్ళ పోటీలను ఆయన దగ్గరుండి ప్రారంభించి, విభిన్న ప్రతిభావంతుల క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఈడా చైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, ఎఎంసి చైర్మన్‌ మామిళ్ళపల్లి పార్థసారధి, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖా ఏడి రామ్‌కుమార్‌, డిఎస్‌డివో అజీజ్‌ తదితరులు పాల్గొన్నారు... Follow us on Website Facebook Instagram YouTube