BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 22 February 2026, 07:19 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

వెంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగడం అభ్యంతరకరం

తెలంగాణ
22 Feb, 2026 - 07:19 PM
305 వీక్షణలు
వెంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగడం అభ్యంతరకరం: నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున తిరుమల వెంకటేశ్వరస్వామిని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం తీవ్రంగా అభ్యంతరకరమని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బైరెడ్డి శబరి విమర్శించారు. ఈ చర్యల వల్ల వైసీపీ పతనం మొదలైందని ఆమె వ్యాఖ్యానించారు. ఆదివారం భారత తొలి తిరుగుబాటు యోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి 179వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ప్రవర్తన అభ్యంతరకరంగా ఉందన్నారు. వెంకటేశ్వరస్వామిని రాజకీయ వేదికలపై వినియోగించడం, నినాదాలు చేయడం ప్రజల విశ్వాసాలను దెబ్బతీస్తోందని పేర్కొన్నారు. వైసీపీ నేతలు గత పాలనలో దేవాలయాల రక్షణలో విఫలమయ్యారని ఆరోపించారు. తిరుమలతో సంబంధం ఉన్న పలు ఘటనలను ప్రస్తావిస్తూ, ఇవన్నీ ప్రజల ఆగ్రహానికి కారణమయ్యాయని అన్నారు. శాసనమండలిలో జరిగిన నిరసనలపై ప్రజల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ, వాటిని సమర్థించేందుకు ప్రయత్నించడం సరికాదని చెప్పారు. ప్రస్తుత పాలన ప్రజాహితాన్ని దృష్టిలో ఉంచుకుని సాగుతోందని, అందుకే ప్రతిపక్షానికి భయం పెరుగుతోందని వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులు మాటలతో కాకుండా చర్యలతో బాధ్యత చూపాలని ఆమె సూచించారు. #AndhraPradeshPolitics #NandyalMP #TDP #YSRCP #PoliticalNews #TeluguNews Follow us on Website Facebook Instagram YouTube