BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 17 December 2025, 09:08 am
Posted by : NTODAY NEWS OFFICIAL

21 ఏళ్లైనా సామాన్యుడికి అందని సమాచార హక్కు చట్టం

తెలంగాణ
17 Dec, 2025 - 09:08 AM
721 వీక్షణలు

21 ఏళ్లైనా సామాన్యుడికి అందని సమాచార హక్కు చట్టం

అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కాదా? – రాపోలు లింగస్వామి NTODAY NEWS: హైదరాబాద్, ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకతకు కీలకమైన సమాచార హక్కు చట్టం (RTI) అమల్లోకి వచ్చి దాదాపు 21 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ, ఇప్పటికీ సామాన్య ప్రజలకు ఈ చట్టం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదని ఆర్‌టీఐ రక్షక్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉత్తమ జర్నలిస్ట్ అవార్డ్స్ గ్రహీత, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్స్ గ్రహీత రాపోలు లింగస్వామి ఆవేదన వ్యక్తం చేశారు.బుధవారం హైదరాబాద్‌లోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన సమాచార హక్కు చట్టానికి సంబంధించిన సూచిక బోర్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా చాలా చోట్ల అసంపూర్తి వివరాలు, కొన్ని కార్యాలయాల్లో ఫోన్ నంబర్లు స్పష్టంగా లేకపోవడం,మరికొన్ని కార్యాలయాలలో ఆర్ టి ఐ సూచిక బోర్డులను ఏర్పాటు చేయడానికి సైతం ఆసక్తి చూపడంలేదు, మరికొన్ని చోట్ల పేరుకే బోర్డులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించిందని తెలిపారు. ఇలా అసంపూర్తి సమాచారంతో సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా చట్టం అమలు పట్ల అధికారుల్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. చట్టాన్ని పక్కాగా అమలు చేయని సంబంధిత అధికారులు, సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పూర్తి సమాచారంతో కూడిన ఆర్‌టీఐ( 2005)సూచిక బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలనే స్పష్టమైన ఆదేశాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేయాలని కోరారు.రాజధాని హైదరాబాద్‌లోనే ఈ పరిస్థితి ఉంటే, గ్రామ స్థాయిలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని లింగస్వామి తెలిపారు. చట్టం అమల్లోకి వచ్చి ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నా, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సమాచార హక్కు చట్టం అంటే ఏమిటి, ఏ కార్యాలయంలో ఎవరి వద్ద సమాచారం కోరాలి, దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి అన్న అంశాలపై సరైన అవగాహన లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో ఉన్న గొప్ప ప్రజాస్వామ్య ఆయుధం అని, ప్రభుత్వ వ్యవస్థలో జవాబుదారీతనాన్ని తీసుకురావడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశమని ఆయన గుర్తు చేశారు. కానీ ఆచరణలో ఈ చట్టం ప్రజలకు పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి రాష్ట్ర, జిల్లా, గ్రామ స్థాయిల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించి, సమాచార హక్కు చట్టం ఉద్దేశ్యం, వినియోగ విధానాలపై ప్రజలకు స్పష్టత కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. Follow us on Website Facebook Instagram YouTube