BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 March 2026, 01:43 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నిరసన..

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
23 Mar, 2026 - 01:43 PM
180 వీక్షణలు

గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నిరసన.. ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్!

హైదరాబాద్: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం అసెంబ్లీ సమీపంలోని గన్ పార్క్ వద్ద భారీ నిరసన చేపట్టారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం, ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు.

​విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు:

"ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కొర్రీలు.. పేద విద్యార్థులకు వర్రీలు" అంటూ రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. గత కొన్ని నెలలుగా ఫీజులు రాక పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

​అసెంబ్లీకి భారీ ర్యాలీ:

గన్ పార్క్ వద్ద నిరసన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి అసెంబ్లీ వరకు ర్యాలీగా బయలుదేరారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.