BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 24 July 2026, 11:39 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య జయంతి ఘనంగా నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Jul, 2026 - 11:39 AM
97 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం, పెనుగొలను: గ్రామ గ్రంథాలయంలో శుక్రవారం గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

అనంతరం నిర్వహించిన సభలో గ్రంథాలయ నిర్వాహకులు తెనాలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, అయ్యంకి వెంకటరమణయ్య 1934 నుంచి 1948 మధ్య కోస్తా ఆంధ్రలో అనేక గ్రంథాలయాల స్థాపనకు విశేష కృషి చేశారని తెలిపారు. గ్రంథాలయ ఉద్యమంతో పాటు ఆయుర్వేదం, ప్రకృతి వైద్యంలోనూ ప్రావీణ్యం సంపాదించి, పత్రికా సంపాదకుడిగా కూడా విశిష్ట గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఆయన సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందని వివరించారు.

హైస్కూల్ పూర్వ విద్యార్థి సంఘ నాయకుడు రాయల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా గ్రంథాలయాల అభివృద్ధికి అయ్యంకి వెంకటరమణయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. "ప్రజా గ్రంథాలయమే ప్రజల విశ్వవిద్యాలయం" అనే సందేశాన్ని గ్రంథాలయ యాత్రల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి చదువుపై చైతన్యం కల్పించిన మహనీయుడిగా ఆయన నిలిచారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యార్థులు, గ్రంథాలయ అభిమానులు పాల్గొని అయ్యంకి వెంకటరమణయ్యకు ఘన నివాళులు అర్పించారు.