BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 13 June 2026, 06:23 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గురుదక్షిణగా కారును అందించిన పూర్వ విద్యార్థి.. భావోద్వేగానికి గురిచేసిన ఘటన

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jun, 2026 - 06:23 AM
135 వీక్షణలు

కర్ణాటక రాష్ట్రం హవేరీ జిల్లా కుమారేశ్వర స్కూల్‌లో ఓ భావోద్వేగ ఘటన చోటుచేసుకుంది. రిటైర్మెంట్‌కు చేరుకున్న ఓ ఉపాధ్యాయుడికి ఆయన పూర్వ విద్యార్థి గురుదక్షిణగా కారు బహుమతిగా అందించాడు.

చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన నవీన్ అనే బాలుడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో ఆ ఉపాధ్యాయుడు స్వయంగా ఇంటికి వెళ్లి బాలుడిని తిరిగి పాఠశాలలో చేర్పించారు. అంతే కాకుండా అతని చదువుకు నిరంతరం అండగా నిలిచి ఎంటెక్ పూర్తయ్యే వరకు ప్రోత్సహించారు.

తరువాత నవీన్ విదేశాల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డాడు. తన జీవితాన్ని మలిచిన గురువు రిటైర్మెంట్‌కు చేరుకున్నారని తెలిసి స్వదేశానికి వచ్చి, గురుదక్షిణగా కారు అందించాడు.

ఈ కార్యక్రమానికి సుమారు వెయ్యి మంది పూర్వ విద్యార్థులు హాజరై ఉపాధ్యాయుడిని ఘనంగా సత్కరించారు. విద్యార్థుల జీవితాలను మలిచిన ఆ గురువు సేవా భావానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది.