BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 09 March 2026, 02:19 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

తెలంగాణ
09 Mar, 2026 - 02:19 AM
263 వీక్షణలు
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట గల్ఫ్ బాధితులకు రూ.5 లక్షల భరోసా – ధర్మపురిలో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని షాదీఖానాలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి కుట్టు మిషన్లు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కుట్టు మిషన్ల కోసం 590 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. తొలి విడతలో వారందరికీ కుట్టు మిషన్లు అందజేస్తున్నట్లు చెప్పారు. అర్హులైన మైనార్టీలు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంబంధిత శాఖలతో మాట్లాడి రుణాలు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహిళలు ప్రభుత్వ అవకాశాలను వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. గల్ఫ్ బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి తెలిపారు. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ధర్మపురి నియోజకవర్గానికి చెందిన 15 కుటుంబాలకు రూ.75 లక్షల చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణ, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 250 మంది గల్ఫ్ బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సహాయం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. #Dharmapuri #MinorityWelfare #AdluriLakshmanKumar #TelanganaNews #PublicAdministration #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube