BREAKING
విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​
Date of Publish : 27 July 2025, 09:02 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

అంతా మా ఇష్టం, మమ్మల్ని ఆపేది ఎవడు?

తెలంగాణ
27 Jul, 2025 - 09:02 PM
326 వీక్షణలు
అంతా మా ఇష్టం, మమ్మల్ని ఆపేది ఎవడు? టైర్ల కంపెనీ వల్ల ఉక్కిరి బిక్కిరి అవుతున్న బొమ్మలరామారం మండల ప్రజలు, పట్టించుకోని అధికారులు NTODAY NEWS:బొమ్మలరామారం ఇంత జరుగుతున్న టైర్ల కంపెనీల వైపు కన్నెత్తి చూడని అధికారులు. గ్రామంలో మూడు టైర్ల కంపెనీలకు గ్రామ పంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు, ఎన్ఓసి జారీ చేయలేదని గ్రామపంచాయతీ కార్యదర్శి, మండల పంచాయతీ అధికారి వెల్లడి. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుందని, నన్ను ఎవరు చూస్తలేరు అనే సామెతలా ఉంది యాదాద్రి భువనగిరి జిల్లా,బొమ్మలరామారం మండలం,రంగాపురం గ్రామ రెవెన్యూ పరిధిలో టైర్ల కంపెనీల బాగోతం. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కంపెనీలు నడుపుకుంటు ప్రజల ప్రాణాలకు హాని కలిగిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామపంచాయతీ నుండి అక్రమ తీర్మానాలు తీసుకొని యదేచ్చగా కంపెనీలు నడుపుకోండి ప్రజల ప్రాణాలతో మీకేం సంబంధం లేదని చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, జిల్లా అధికారులు, మండల ఎంపిఓ, గ్రామ పంచాయతీ కార్యదర్శి. టైర్ల కంపెనీల వల్ల లాభం ఎవరికి? నష్టం ఎవరికీ? ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్న కంపెనీలు లబోదిబోమంటున్నా మండల ప్రజలు.టైర్ల కంపెనీ నుండి వచ్చే విష కాలుష్యం దుర్వాసనతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు ఆర్టిఐ ద్వారా అడిగిన సమాచారం మేరకు సమాచార హక్కు చట్టం ద్వారా రంగాపురం గ్రామపంచాయతీ కార్యదర్శి Lr.No.GP/01/2025-26 తేది: 14/07/2025, మండల పంచాయతీ అధికారి Lr.No.MPO/146/06/2025- 26తేది:14/07/2025 ఇచ్చిన సమాచారం మేరకు గ్రామపంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు జారీ చేయలేదని అధికారులు చెప్పడం కోస మెరుపు. ప్రజల ప్రాణాలకు హాని జరుగుతున్న ప్రజా సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు టైర్ల కంపెనీలపై నోరు మెదపడం లేదు ఎందుకు దీని వెనక ఆంతర్యం ఏమిటి? భారీ మూల్యం చెల్లించే వరకు కంపెనీలపై స్పందన ఉండదా. అధికారుల అలసత్వానికి నిదర్శనం ప్రజల నిండు ప్రాణాలు,ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తగు చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం. Follow us on Website Facebook Instagram YouTube