BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 04 April 2026, 07:38 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. ఈ నెల 13న బీఆర్ఎస్‌లో చేరనున్న తాటిపర్తి జీవన్ రెడ్డి

తెలంగాణ
/ కరీంనగర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Apr, 2026 - 07:38 AM
164 వీక్షణలు

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. ఈ నెల 13న బీఆర్ఎస్‌లో చేరనున్న తాటిపర్తి జీవన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో పెను మార్పు చోటుచేసుకోబోతోంది. తాటిపర్తి జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రచారానికి తెరపడింది.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన ఆయన అధికారికంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 13న తన అనుచరులతో కలిసి గులాబీ కండువా కప్పుకోనున్నారు.

ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ నెల 7న కీలక రాజకీయ కదలికలు చోటుచేసుకోనున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు స్వయంగా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. దీంతో జగిత్యాల నియోజకవర్గంలో రాజకీయ సందడి మొదలుకానుంది.

జీవన్ రెడ్డి చేరికతో జగిత్యాల కోటలో బీఆర్ఎస్ బలం మరింత పెరుగుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఆయనలాంటి అనుభవజ్ఞుడైన నాయకుడు రావడం వల్ల ఉమ్మడి జిల్లాలో పార్టీకి కొత్త ఊపు వస్తుందని గులాబీ నేతలు అంచనా వేస్తున్నారు.

ఈ చేరికను ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. చేరిక అనంతరం జగిత్యాలలోనే పార్టీ ప్లీనరీ నిర్వహించే అవకాశాన్ని బీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తోంది. ఆ సభలో పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని సమాచారం.

జగిత్యాల వేదికగా జరిగే ఈ భారీ సభ ద్వారా ఉత్తర తెలంగాణలో తమ పట్టు మరింత బలోపేతం చేసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్‌లో దశాబ్దాలుగా సేవలందించిన జీవన్ రెడ్డి పార్టీ మార్పు ఆ పార్టీకి గట్టి దెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.