BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 28 March 2026, 04:59 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

కిషన్ రావు పేటలో వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రాణ ప్రతిష్ట

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
28 Mar, 2026 - 04:59 PM
213 వీక్షణలు

కిషన్ రావు పేటలో వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రాణ ప్రతిష్ట: పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు మద్ధుల గోపాల్ రెడ్డి

వెల్గటూర్ /కిషనరావుపేట 

మండలంలోని కిషన్ రావు పేట గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం శనివారం అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. భక్తిశ్రద్ధల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ సింగిల్ విండో చైర్మన్ శ్రీ మద్ధుల గోపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

​భక్తి మార్గమే సుగమ మార్గం: మద్ధుల గోపాల్ రెడ్డి

​ఈ సందర్భంగా మద్ధుల గోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ.. ఇలాంటి దైవ కార్య క్రమాల్లో పాల్గొనడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

​స్త్రీ శక్తి - ఆదిశక్తి: సృష్టిలో సమస్త మానవాళికి, జీవకోటికి ప్రాణాధారమైన తల్లిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి.

​గ్రామ దేవతల విశిష్టత: అందుకే ప్రతి గ్రామంలో అమ్మవారిని గ్రామ దేవతగా ప్రతిష్టించి గ్రామ రక్షణ కోసం పూజిస్తారని పేర్కొన్నారు.

​కలియుగంలో భక్తి: ఈ కలియుగంలోని దుష్ప్రభావాలను తొలగించుకోవడానికి భక్తి మార్గం ఒక్కటే సుగమమైన మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.

​గ్రామస్తులందరూ కలిసికట్టుగా, భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అభినందనీయమని ఆయన కొనియాడారు.

​పాల్గొన్న ముఖ్యులు

​ఈ కార్యక్రమంలో నాయకులు గూడ రాంరెడ్డి, కొంగల రాజేందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డిలతో పాటు:

​గొడిసెలపేట్ గ్రామ సర్పంచ్ కందికట్ల అమృత రాజేష్ గారు

​కోటిలింగాల ఆలయ చైర్మన్

​ఉమ్మడి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి రమేష్ గారు

​మాజీ ఎంపీటీసీ మాచర్ల రాజేందర్

​గ్రామ శాఖా అధ్యక్షులు సత్యం

​ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పిట్ట లక్ష్మణ్

​మరియు సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు