BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 31 August 2026, 08:11 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కనిపించకుండా పోయిన ప్రతి వ్యక్తిపై తక్షణమే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి..

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Aug, 2026 - 08:11 PM
51 వీక్షణలు

కనిపించకుండా పోయిన ప్రతి వ్యక్తిపై తక్షణమే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

కనిపించకుండా పోయిన వ్యక్తుల విషయంలో పోలీసులు నిర్లక్ష్యం వహించకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలను తీవ్రంగా హెచ్చరించింది. వయస్సు, లింగ భేదం లేకుండా ఏ వ్యక్తి అదృశ్యమైనట్లు సమాచారం అందినా వెంటనే ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌) నమోదు చేయడం తప్పనిసరి అని స్పష్టం చేసింది.

గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లోని "వ్యక్తి" అనే పదం కేవలం పిల్లలకు మాత్రమే పరిమితం కాదని, పెద్దలు కూడా అందులో భాగమేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమయ్యే రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, పోలీసు ఉన్నతాధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

జస్టిస్‌ అహ్సానుద్దీన్‌ అమనుల్లా, జస్టిస్‌ ఆర్‌. మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మానవ అక్రమ రవాణా నిరోధం, అదృశ్యమైన వ్యక్తుల ఆచూకీకి సంబంధించిన కేసును విచారిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

గతంలో మే 22న ఇచ్చిన ఆదేశాల్లో వ్యక్తులు కనిపించకుండా పోయిన వెంటనే కేసు నమోదు చేయాలని స్పష్టం చేసినప్పటికీ, కొన్ని రాష్ట్రాలు "వ్యక్తి" అనే పదాన్ని కేవలం పిల్లలకు మాత్రమే వర్తిస్తుందని భావించడం పట్ల ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది.

అదృశ్యమైన వ్యక్తుల విషయంలో ప్రాథమిక విచారణ పేరుతో ఆలస్యం చేయడం, కుటుంబ సభ్యులే వెతుక్కోవాలని వదిలేయడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సమాచారం అందిన వెంటనే పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించింది.

వ్యక్తి కనిపించకుండా పోయిన తొలి గంటలు అత్యంత కీలకమైనవని, వాటినే "గోల్డెన్‌ అవర్స్‌"గా పరిగణించాలని ధర్మాసనం పేర్కొంది. ఆ సమయంలోనే ఆచూకీని సురక్షితంగా గుర్తించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపింది.

సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించని, ఇప్పటివరకు అవసరమైన అఫిడవిట్లు సమర్పించని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అక్టోబరు 5న జరిగే తదుపరి విచారణకు వారు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.

అలాగే దేశవ్యాప్తంగా మానవ అక్రమ రవాణా నిరోధక విభాగాలు (ఏహెచ్‌టీయూ) పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అదృశ్యమైన వ్యక్తుల వివరాల కోసం ఉన్న పోర్టళ్లను పరస్పరం అనుసంధానం చేసి వేగంగా సమాచార మార్పిడి జరిగేలా చూడాలని ఆదేశించింది.