BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 29 March 2026, 02:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కొండెక్కిన కోడి... దిగింది..! చికెన్ ధరలో భారీ తగ్గుదల

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 02:02 PM
204 వీక్షణలు

కొండెక్కిన కోడి... దిగింది..!  చికెన్ ధరలో భారీ తగ్గుదల – కిలో రూ.270కే బ్రాయిలర్

విజయవాడ, మార్చి 29: ఇటీవల ఆకాశాన్నంటిన చికెన్ ధరలు ఇప్పుడు క్రమంగా దిగివస్తున్నాయి. చికెన్ ప్రియులకు ఊరటనిచ్చేలా కిలో బ్రాయిలర్ చికెన్ ధర ప్రస్తుతం సుమారు రూ.270కు చేరింది. గత వారం వరకు రూ.400 వరకు పెరిగిన ధరలు ఒక్కసారిగా తగ్గడంతో మార్కెట్లో కొనుగోళ్లు మళ్లీ పెరుగుతున్నాయి.

మార్చి నెల ప్రారంభంలోనే చికెన్ ధరలు రూ.360 నుంచి రూ.400 వరకు పలికాయి. వేసవి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కోళ్ల మరణాలు ఎక్కువ కావడం, దాణా ఖర్చులు పెరగడం వంటి కారణాలతో పౌల్ట్రీ రైతులు ధరలను పెంచాల్సి వచ్చింది. అదే సమయంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో చికెన్‌కు గిరాకీ పెరిగి ధరలు రికార్డు స్థాయికి చేరాయి.

అయితే, గత వారం నుంచి పరిస్థితులు మారాయి. సరఫరా మెరుగుపడటం, డిమాండ్ కొంత తగ్గడం వల్ల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. హైదరాబాద్, వరంగల్ వంటి ప్రాంతాల్లో ప్రస్తుతం కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.270గా కొనసాగుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం ప్రాంతంలో రూ.300 నుంచి రూ.350 వరకు అమ్మకాలు జరుగుతున్నాయి.

ఉష్ణోగ్రతల్లో మార్పులు, కోళ్ల పెంపకం స్థితి, మార్కెట్‌లో లభ్యత వంటి అంశాలపై చికెన్ ధరలు ఆధారపడి ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. మొత్తానికి, కొండెక్కిన కోడి ధర దిగివచ్చి వినియోగదారులకు కొంత ఊరటనిచ్చింది.