BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

కోర్టు ఆదేశాలు లెక్కచేయని ఐఏఎస్ అధికారులు… చట్టం ఎలా బుద్ధి చెబుతుంది?

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 03:04 AM
115 వీక్షణలు

దేశంలో న్యాయ వ్యవస్థకు అత్యున్నత ప్రాధాన్యం ఉంది. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా, హై కోర్టులు ఇచ్చే ఆదేశాలు ప్రతి ప్రభుత్వ అధికారికి తప్పనిసరిగా అమలు చేయాల్సినవే. అయితే కొన్ని సందర్భాల్లో ఐఏఎస్ అధికారులు కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో చట్టం కఠినంగా వ్యవహరిస్తుంది.

కోర్టు ఇచ్చిన తీర్పును కావాలని అమలు చేయకపోవడం లేదా ఆలస్యం చేయడం ‘కోర్టు ధిక్కరణ’గా పరిగణించబడుతుంది. దీనికి సంబంధించి కంటెంట్ ఆఫ్ కోర్టు, యాక్ట్ 1971 స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. కోర్టు నోటీసు ఇచ్చినప్పటికీ అధికారులు స్పందించకపోతే, కోర్టు తీవ్రంగా స్పందిస్తుంది.

మొదటగా సంబంధిత అధికారిని వ్యక్తిగతంగా కోర్టులో హాజరు కావాలని ఆదేశించవచ్చు. ఆదేశాలను పట్టించుకోకుండా వరుసగా గైర్హాజరు అయితే, కోర్టు నాన్-బైలబుల్ వారెంట్ జారీ చేసే అధికారాన్ని వినియోగించవచ్చు. అవసరమైతే పోలీసుల ద్వారా అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచమని ఆదేశాలు ఇవ్వవచ్చు.

చట్టం ప్రకారం కోర్టు ధిక్కరణకు గరిష్టంగా ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో హైకోర్టులు పలువురు ఉన్నతాధికారులను వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించడం, కఠిన వ్యాఖ్యలు చేయడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో బాధితులు తీసుకోవాల్సిన చర్యలు కూడా స్పష్టంగా ఉన్నాయి. ముందుగా న్యాయవాది ద్వారా అధికారిని వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టును అభ్యర్థించాలి. ఇంకా స్పందన లేకపోతే నాన్-బైలబుల్ వారెంట్ కోసం వినతిపత్రం దాఖలు చేయవచ్చు. కోర్టు ధిక్కరణలో శిక్ష పడితే అది వారి సర్వీస్ రికార్డుపై ప్రభావం చూపి ప్రమోషన్లు, పదవీ విరమణ ప్రయోజనాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. కింది కోర్టులో ఆలస్యం అయితే నేరుగా హై కోర్టు ను ఆశ్రయించి సివిల్ కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేయడం ద్వారా వేగంగా న్యాయం పొందవచ్చు.

కోర్టు ఆదేశాలు కేవలం సూచనలు కావు… అవి అమలు చేయాల్సిన చట్టబద్ధ బాధ్యత. వాటిని విస్మరించే వారెవరైనా— ఉన్నతాధికారులైనా—చట్టం ముందు సమానమే.