BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 19 April 2026, 11:55 am
Posted by : RAMU JAJU

కరెంటు కోత.. ఉక్కపోత..

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Ramu jaju డొంకేశ్వర్ మండల ప్రతినిధి
19 Apr, 2026 - 11:55 AM
124 వీక్షణలు
డొంకేశ్వర్: అసలే వేసవి కాలం..ఆపై కరెంట్‌ కోతలు.. రెండూ కలిపి ప్రజలకు ఉక్కపోత..ఇదీ జిల్లాలో దుస్థితి. మాడు పగిలే ఎండలతో ఉదయం 9 దాటితే బయటకు రావాలంటేనే బెంబేలెత్తుతున్న ప్రజలు ఇంట్లోనే సేద తీరుదామన్నా కరెంటు లేక నానా అవస్థలు పడుతున్నారు. ఉక్క పోతలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనాలు ప్యానో, కూలరో వేసుకొని భానుడి తాపం నుంచి ఉపశమనం పొందాలనుకుంటే విద్యుత్‌ శాఖ అధికారులు విద్యుత్తు కోతలతో ప్రజలను విసుగెత్తిస్తున్నారు. మెయింటినెన్స్‌ డే అన్న పేరుతో వారాని కోసారి ఐదు నుంచి ఆరు గంటల పాటు విద్యుత్తు కోతలు విధిస్తూనే మరోవైపు ప్రతిరోజు అడ్డదిడ్డంగా విద్యుత్‌ సరఫరా నిలిపేస్తుండడంతో ప్రజలు ఇళ్లలో కూడా ఉండలేని పరిస్థితి దాపురించింది. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా విద్యుత్తు కోతలు విధిస్తూ సమాచారం కోసం విద్యుత్‌ శాఖ సిబ్బంది, అధికారులను చరవాణి ద్వారా సంప్రదిస్తే సరైన సమాధానం చెప్పే నాధుడే లేడని ప్రజలు వాపోతున్నారు. ఓవైపు ఉక్క పోతలు, మరోవైపు కరెంటు కోతలతో చిన్నపిల్లలు, వద్ధులు వేసవి తాపానికి అల్లాడిపోతున్నారు. విద్యుత్‌ శాఖ అధికా రుల నిర్లక్ష్య వైఖరికి ప్రజలు అసహనం వ్యక్తం చేస్తూ ఇకనైనా అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్తును అందించాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. విద్యుత పంపిణీ సంస్థల నుంచి వినియోగానికి సరిపడా పంపిణీ కాకపోవడంతో అనధికారికంగా కోతలు పెడుతున్నట్లు తెలుస్తోంది.

కోతలు లేకుండా సరఫరా చేయాలి పగలు, రాత్రి అన్న లేడా లేకుండా కరెంటు పోతోంది. ఉక్కపోత, వేడితో తీవ్రఇబ్బందులు పడ్డాం. వృద్ధులు, చిన్న పిల్లలు మరింత ఇబ్బందిపడ్డారు. ఎండాకాలాన్ని దష్టిలో ఉంచుకుని కోతలు లేకుండా కరెంటు సరఫరా చేయాలి.- సావిత్రి, గృహిణి.
మూడురోజుల నుంచి ఎక్కువగా తీసేస్తున్నారు ఎండలు పెరిగిపోయాయి. పగటి వేళల్లో ఇళ్లలో ఉండలేని పరిస్థితి. రాత్రి వేళల్లో వేడి, ఉక్కపోత ఎక్కువగా ఉంటోంది. కరెంటు తీసేస్తున్నారు. గత రెండు మూడు రోజులుగా మరి ఎక్కువగా కరెంటు పోతోంది.- లక్ష్మీ గృహిణి.
పిల్లలు ఇబ్బంది పడుతున్నారు తరచూ విద్యుత్తు కోతలు విధిస్తుండడంతో ఉక్కపోతకు చిన్న పిల్లలు ఇంట్లో ఉండలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఏ చెట్టు కిందనో సేదతీరుదామనుకున్నా ఎక్కడా చెట్టు జాడే కనబడటం లేదు. ప్రతి నెలా వెన్ను విరిచి కరెంటు బిల్లులు వసూలు చేస్తున్నారు. విద్యుత్తు శాఖ అధికారులు అంతరాయం లేని విద్యుత్తును అందించలేకపోతున్నారు.- సాయికృష్ణ అన్నారం.

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విద్యుత్తు అధికారులు విద్యుత్తు సమస్యలపై ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ విద్యుత్తు శాఖలో ఇస్తారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామంలో కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎంత సేపు ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. విద్యుత్తు శాఖలో ఉన్నత అధికారుల నుండి కిందిస్థాయి సిబ్బంది వరకు వినియోగదారుల పట్ల చాలా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఆ శాఖలోని ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించే విధంగా చర్యలు చేపట్టాలి.- వంశీ, అన్నారం.