BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 25 March 2026, 11:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కుళ్లిపోయిన గుడ్లతో తినుబండారాలు తయారీ

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 11:36 PM
146 వీక్షణలు

కుళ్లిపోయిన గుడ్లతో తినుబండారాలు తయారీ – ముగ్గురు అరెస్ట్

హైదరాబాద్, మార్చి 25: నగరంలోని కాటెదాన్ ప్రాంతంలో అక్రమంగా ప్రమాదకర ఆహార పదార్థాల తయారీ నిర్వహిస్తున్న ముఠాపై మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు మెరుపుదాడి నిర్వహించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్. శ్రీనివాస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ దాడిలో “మధురై మీనాక్షి ఫుడ్ కంపెనీ” పేరుతో నడుస్తున్న యూనిట్‌లో కుళ్లిపోయిన కోడిగుడ్లు, హానికర రసాయనాలతో డోనట్స్, కేకులు తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

అరెస్టైన నిందితులు అఫ్రిది అన్సారీ (22), యాసిన్ (32), ఖత్రేషన్‌గా పోలీసులు తెలిపారు. వీరు మార్కెట్ నుండి పాడైన, పగిలిన గుడ్లను సేకరించి వాటిలో సోడియం బెంజోయేట్, సోర్బిక్ యాసిడ్ వంటి రసాయనాలు కలిపి అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

ఈ దాడిలో 330 కుళ్లిపోయిన గుడ్లు, భారీగా రసాయనాలు, 150 కిలోల తయారైన కేకులు, డోనట్స్, అలాగే డాల్డా, మిల్క్ పౌడర్‌తో పాటు మిక్సింగ్ మెషీన్లు, ఓవెన్లు తదితర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులపై మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 268/2026 కింద సెక్షన్ 318(4), 274 BNS ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని డీసీపీ అభినందించారు.