BREAKING
అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ
Date of Publish : 07 June 2026, 09:52 am
Posted by : V శ్రీనివాస్

లోన్ల పేరిట మోసం ఇద్దరు మహిళలపై కేసు నమోదు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
07 Jun, 2026 - 09:52 AM
91 వీక్షణలు

రుణాలు ఇప్పిస్తామంటూ అమాయక ప్రజలను నమ్మించి, లక్షల రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఇద్దరు మహిళలపై మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు వివరాలను సీఐ ప్రమోద్ రావు శనివారం వెల్లడించారు.

​పోలీసుల కథనం ప్రకారం... ఇక్బాల్ అహ్మద్ నగర్ కు చెందిన బద్రున్నిసా, మరియు గోపాలవాడకు చెందిన అరవ సుబ్బలక్ష్మి అనే ఇద్దరు మహిళలు సులభంగా లోన్లు ఇప్పిస్తామని నమ్మబలికారు. రూ. 5 లక్షల లోన్ ఇప్పిస్తామంటూ దాదాపు పది మంది బాధితుల నుండి విడతల వారీగా మొత్తం రూ. 3 లక్షల వరకు వసూలు చేశారు.

​డబ్బులు తీసుకుని ఎంతకాలమైనా లోన్ రాకపోవడంతో, బాధితులు సదరు మహిళలను నిలదీశారు. అయితే వారి నుంచి ఎటువంటి సరైన సమాధానం రాకపోగా, నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. శనివారం బాధితురాలు షేక్ రిజ్వానా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులైన ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు