BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 03 April 2025, 08:11 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి స్థానిక భవన నిర్మాణ కార్మికులకు అవకాశం కల్పించాలి

తెలంగాణ
03 Apr, 2025 - 08:11 AM
231 వీక్షణలు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి స్థానిక భవన నిర్మాణ కార్మికులకు అవకాశం కల్పించాలి--సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు NTODAY NEWS: భువనగిరి ప్రభుత్వం త్వరలో నిర్మించబోయే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి స్థానికంగా ఉన్న భవన నిర్మాణ కార్మికులకే అవకాశం కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రోజున సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం భువనగిరి మండల 2వ మహాసభ దాసరి లక్ష్మయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా గోద శ్రీరాములు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్న భువన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలం అయ్యాయని అయన ఆరోపించారు పెండింగ్ లో ఉన్న క్లెయిమ్స్ విడుదల చేయడం లేదని, ఆన్లైన్లో నమోదు కోసం కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సమస్యలు పరిష్కరించడంలో కార్మిక శాఖ వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఆన్లైన్ అప్డేట్ పేరుతో కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు కార్మికులు రోజుల తరబడి లేబర్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుందని అన్నారు. కార్మిక సంక్షేమ బోర్డులో జమ కావాల్సిన సెస్సు సక్రమంగా వసూలు చేయకపోవడం వల్ల కార్మిక సంక్షేమ నిధులు పెరగడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన కార్మిక చట్టాలు వలన కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు గోరేటి రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కార్యదర్శి ఏశాల అశోక్, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి గనబోయిన వెంకటేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube