BREAKING
thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన
Date of Publish : 01 May 2026, 08:44 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మే 2న ఫోన్లలో సైరన్ శబ్దం పరీక్ష భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టత

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 08:44 PM
204 వీక్షణలు

మే 2న ఫోన్లలో సైరన్ శబ్దం పరీక్ష భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టత

రేపు దేశవ్యాప్తంగా లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒక్కసారిగా పెద్ద సైరన్ శబ్దం వినిపించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది అయితే ఇది ఎలాంటి ప్రమాద సూచన కాదని పూర్తిగా పరీక్ష మాత్రమేనని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది భవిష్యత్తులో వరదలు తుఫానులు భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను తక్షణమే అప్రమత్తం చేయడానికి రూపొందించిన అత్యవసర హెచ్చరిక వ్యవస్థ పనితీరును పరీక్షించేందుకు టెలికమ్యూనికేషన్ శాఖ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సంయుక్తంగా ఈ పరీక్ష నిర్వహిస్తున్నాయి ఈ పరీక్షలో భాగంగా మొబైల్ ఫోన్లకు ఒకేసారి పరీక్ష సందేశం చేరడంతో పాటు పెద్ద సైరన్ శబ్దం వినిపించనుంది ఇది కేవలం వ్యవస్థ పనితీరు పరిశీలన మాత్రమేనని అధికారులు తెలిపారు ఈ అత్యవసర హెచ్చరిక వ్యవస్థ అంతర్జాతీయ సిఫారసుల ఆధారంగా రూపొందిన సందేశ ప్రమాణ విధానం ప్రకారం పనిచేస్తుండగా ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలులో ఉంది ఈ సాంకేతికత ద్వారా విపత్తు సమయంలో సెకన్లలోనే లక్షల మందికి సమాచారం చేరే అవకాశం ఉండగా వరదలు తుఫానులు వంటి ప్రమాదాల ముందు ముందస్తు హెచ్చరికలు పంపి ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చని అధికారులు పేర్కొన్నారు ప్రమాదం ఉన్న ప్రాంతంలోని ఫోన్లకే హెచ్చరికలు పంపే విధంగా ఈ వ్యవస్థ రూపొందించబడినట్లు కేంద్రం వెల్లడించింది