BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 15 February 2026, 02:43 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

కోటిలింగాలలో మహాశివరాత్రి శోభ

తెలంగాణ
15 Feb, 2026 - 02:43 PM
303 వీక్షణలు
కోటిలింగాలలో మహాశివరాత్రి శోభ: గోదావరి తీరానికి వేలాది భక్తుల రాక NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వెల్గటూర్ మండలం కోటిలింగాల పుణ్యక్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. శనివారం తెల్లవారుజాము నుంచే ఉమ్మడి జిల్లాల నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం తీరంలో వెలసిన కోటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖుల హాజరు ఈ సందర్భంగా ఉమ్మడి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాటిపర్తి శైలేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మెరుగు మురళి, ఉపసర్పంచ్ గండ్ర ప్రతాప్ రావు, ధావుల శశి తదితరులు స్వామిని దర్శించుకున్నారు. గోదావరిలో పుణ్యస్నానం చేసి ఆలయ ప్రాంగణంలో శివనామస్మరణ చేశారు. భక్తుల రద్దీ వేలాది మంది భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు “ఓం నమః శివాయ” మంత్రోచ్చారణల మధ్య స్వామిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ తగిన ఏర్పాట్లు చేసింది. కట్టుదిట్టమైన భద్రత భారీ రద్దీ దృష్ట్యా వెల్గటూర్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు గోదావరి ఘాట్ల వద్ద నిరంతర పర్యవేక్షణ చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఏటా నిర్వహించే మహాశివరాత్రి వేడుకలతో కోటిలింగాల క్షేత్రం ఆధ్యాత్మిక కాంతులతో వెలిగిపోతోంది. #MahaShivaratri #Kaleshwaram #Kotilingala #Godavari #TelanganaTemples Follow us on Website Facebook Instagram YouTube