www.ntodaynews.com
DYFI 17వ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి
తెలంగాణ
DYFI 17వ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి
NTODAY NEWS: నల్గొండ జిల్లా
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ 17వ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి మల్లం మహేష్ డి వై ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా 17వ మహాసభలను నవంబర్ 20 21 తేదీలలో తిపర్తి లో నిర్వహిస్తున్నామని, ఈ మహాసభలను జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ పిలుపునిచ్చారు.
స్థానిక డివైఎఫ్ఐ కార్యాలయంలో జిల్లా మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ మాట్లాడుతూ డివైఎఫ్ఐ దేశభక్తి భావాలతో దేశ సమైక్యత సమగ్రత కోసం పాటుపడుతుంది, మా దేహం ముక్కలైన దేశం ముక్కలు కానీవం అంటూ 46 ఏళ్లుగా దేశ రక్షణకై అనేక త్యాగాలు చేసింది డివైఎఫ్ఐ. అట్లాంటి దేశభక్తి గల డివైఎఫ్ఐ సంఘం 17వ నల్గొండ జిల్లా మహాసభలు అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణం లో నవంబర్ 20, 21 తేదీలలో తిప్పర్తి మండల కేంద్రంలో దాదాపు 400 మంది ప్రతినిధులతో మహాసభలను నిర్వహించడం జరుగుతుంది
ఈ మహాసభలో భవిష్యత్తు కర్తవ్యాలను చర్చించి పోరాటాల రూపకల్పన చేయనున్నాం.
ఈ మహాసభలకు యువతి యువకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి నాయకులు బూర్గు గోపికృష్ణ, గంజి రాజేష్, నాగయ్య, యాదగిరి, సాయి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube