BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 25 April 2026, 11:32 pm
Posted by : యామనూరి మల్లికార్జున

ముఖ్య కార్యకర్తలతో, నాయకులతో సమావేశం నిర్వహించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
25 Apr, 2026 - 11:32 PM
125 వీక్షణలు
ముఖ్య కార్యకర్తలతో, నాయకులతో సమావేశం నిర్వహించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్

నంద్యాల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ శనివారం నంద్యాలలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఫరూక్ నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి పనులు మరియు ప్రజల సమస్యలపై కార్యకర్తలతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చొరవ తీసుకోవాలని మంత్రి ఫరూక్ సూచించారు. నంద్యాల నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో జాప్యం లేకుండా చూడాలని అధికారులతో సమన్వయం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి సమస్యలను పరిష్కరించడంలో తాను ఎల్లప్పుడూ ముందుంటానని మంత్రి ఫరూక్ భరోసా ఇచ్చారు. రాబోయే రోజుల్లో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మరింత ఉత్సాహంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి కీలక నాయకులు, వివిధ విభాగాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.