BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

చాట్రాయి మండలానికి చెందిన ఆరుగురు పాత నేరస్తుల బైండ్ ఓవర్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 May, 2026 - 02:41 PM
197 వీక్షణలు

నవోదయం–2.0 కార్యక్రమంలో భాగంగా నాటు సారా నిర్మూలనపై ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు 

నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారా రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన నవోదయం–2.0 కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఏలూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ బి.శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ నాగ ప్రభు కుమార్, జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఆఫీసర్ అవులయ్య ఆదేశాల మేరకు, నూజివీడు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఆరుగురు పాత నేరస్తులను చాట్రాయి తహసిల్దార్ (మండల కార్యనిర్వాహక మేజిస్ట్రేట్) ఎదుట హాజరుపరిచి బైండ్ ఓవర్ చేశారు.

ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ, బైండ్ ఓవర్ కాలపరిమితి ఒక సంవత్సరం ఉంటుందని తెలిపారు. ఈ వ్యవధిలో మళ్లీ ఎక్సైజ్ నేరాలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై రూ.1 లక్ష జరిమానా విధించడంతో పాటు ప్రభుత్వ పథకాలు కూడా రద్దు చేయబడతాయని హెచ్చరించారు.

బైండ్ ఓవర్ చేసిన వ్యక్తులు:

భారోతు బిక్షం – పోతనపల్లి పెద్ద తండా

ధారావతు శ్రీను – పోతనపల్లి పెద్ద తండా

గుగులోతు వెంకటేష్ – పోతనపల్లి పెద్ద తండా

గుర్రం వెంకట మారేషు – మర్లపాలెం

ధనికొండ శ్రీను – మర్లపాలెం

కొమ్ము విజయలక్ష్మి – చీపురుగూడెం

ఇదిలా ఉండగా, నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఆగిరిపల్లి, నూజివీడు, ముసునూరు, చాట్రాయి మండలాల్లో బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ.మస్తానయ్య హెచ్చరించారు.

నాటు సారా తయారీ, విక్రయం, నిల్వ మాత్రమే కాకుండా, నాటు సారా తయారీలో ఉపయోగించే బెల్లం సరఫరా చేసే వ్యాపారులు, బెల్లపు ఊటలను కలిగి ఉన్న భూయజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.