BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 21 November 2025, 01:25 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

తెలంగాణ
21 Nov, 2025 - 01:25 AM
257 వీక్షణలు
ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు NTODAY NEWS: ఏలూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్ కుమార్ ఆదిత్య డిగ్రీ కళాశాల సత్రంపాడు ఏలూరులో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగిసినట్లు ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వంగా వెంకటేశ్వరరావు తెలిపారు .ఈ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ముందుగా డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ వంగా వెంకటేశ్వర రావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 1968 నవంబర్ 14 నుంచి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రతి ఏటా నిర్వహిస్తున్నారని, ఇటువంటి వారోత్సవాల వల్ల విద్యార్థులలో పఠనా శక్తి పెంపొందడంతో పాటు, వ్యక్తి సర్వతోముఖాభివృద్ధికి గ్రంథాలయాలు పాటు పడతాయని తెలియజేశారు. ప్రతి విద్యార్థి గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలని, ప్రతి రోజూ న్యూస్ పేపర్ తప్పక చదవాలని, ఇంగ్లీషు భాష పై పట్టు సాధించాలని, కమ్యూనికేషన్స్ స్కిల్స్ పెంపొందించుకుని ,క్యాంపస్ ఇంటర్వ్యూలలో విజయం సాధించాలని తెలిపారు. లైబ్రేరియన్ పుప్పాల వీరభద్రరావు మాట్లాడుతూ గ్రంథాలయాలు పఠనాశక్తిని పెంపొందిస్తాయని, గ్రంథాలయాలు సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తమ విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకునేందుకు ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని తెలిపారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, వకృత్వం, చిత్రలేఖనం, క్విజ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. విజేతలను ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ .శేషారెడ్డి, సెక్రటరీ డాక్టర్ యన్. సుగుణ రెడ్డి, అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ బి.ఈ.వి. ఎల్ నాయుడు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డి. వి.వి. ఫణికుమార్, తెలుగు అధ్యాపకురాలు పి. సౌభాగ్య లక్ష్మి మరియు అధ్యాపక, అధ్యాపకేతర బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube