BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 31 March 2026, 01:56 am
Posted by : యామనూరి మల్లికార్జున

నంద్యాలకు నూతన కోర్టుల మంజూరు

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
31 Mar, 2026 - 01:56 AM
144 వీక్షణలు

నంద్యాలకు నూతన కోర్టుల మంజూరు

న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్‌ ను ఘనంగా సన్మానించిన నంద్యాల బార్ అసోసియేషన్

ఉమ్మడి కర్నూలు జిల్లాకు 22 నూతన కోర్టులు, అందులో భాగంగా కేవలం నంద్యాలకే 4 కోర్టులు మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారిని నంద్యాల బార్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. స్థానిక బార్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి ఫరూక్ కి పూలమాలలు వేసి, దుశ్శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. 


ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ నంద్యాల ప్రాంతవాసులకు న్యాయం మరింత చేరువయ్యేలా, పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ఈ నూతన కోర్టుల ఏర్పాటు ఎంతో దోహదపడుతుందని తెలిపారు . న్యాయశాఖ మంత్రి ఫరూక్ గారు బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే నంద్యాల జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ చూపినందుకు వారు మంత్రి ఫరూక్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాల కోర్టుతో మరియు ఇక్కడి న్యాయవాద మిత్రులతో నాకు దశాబ్దాల అనుబంధం ఉందని . ఈ రోజు మీ అందరి మధ్య ఇలా సన్మానం పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలు నాపై బాధ్యతను మరింత పెంచాయి అని తెలిపారు. రాష్ట్ర న్యాయశాఖ మంత్రిగా కోర్టులలో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యంగా జూనియర్ న్యాయవాదుల సంక్షేమం మరియు కోర్టుల ఆధునీకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు . సమాజంలో అణగారిన వర్గాలకు, పేదలకు త్వరితగతిన న్యాయం అందేలా చూడటంలో న్యాయవాదుల పాత్ర కీలకమని, ప్రభుత్వం తరపున వారికి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. తన గెలుపులో మరియు రాజకీయ ప్రస్థానంలో అండగా నిలిచిన నంద్యాల ప్రజలకు, న్యాయవాద మిత్రులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.


ఈ కార్యక్రమంలో నంద్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు హుస్సేన్ బాషా, ఉపాధ్యక్షులు బి.ఎన్.వి. సుబ్బరాయుడు, ప్రధాన కార్యదర్శి ఎమ్.ఆర్. కృష్ణా రెడ్డి, కోశాధికారి ఎస్. మద్దిలేటి రెడ్డి, జాయింట్ సెక్రటరీ బాలు నాయక్, లైబ్రేరియన్ మద్దిలేటి యాదవ్, మహిళా ప్రతినిధి సౌజన్య, సీనియర్ న్యాయవాదులు రామచంద్రరావు, రాజేశ్వర్ రెడ్డి , ప్రసాద్ రెడ్డి, బాబు, అనీఫ్, నరసింగరావు, నటరాజ్, తులసి రెడ్డి, రామ్ మోహన్ రెడ్డి, రాము రాయల్, నందం బాబురావు తదితరులు పాల్గొన్నారు