BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 22 February 2026, 07:16 am
Posted by : NTODAY NEWS OFFICIAL

యూరియా కొరతపై ఆందోళన అవసరం లేదు

తెలంగాణ
22 Feb, 2026 - 07:16 AM
277 వీక్షణలు
యూరియా కొరతపై ఆందోళన అవసరం లేదు: మండల వ్యవసాయ అధికారి గిరిబాబు రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని భరోసా NTODAY NEWS: చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో యూరియా సరఫరా విషయంలో ఎలాంటి కొరత లేదని మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు తెలిపారు. శనివారం వెలిమినేడు గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం కార్యాలయాన్ని సందర్శించి ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడారు. చిట్యాల మండల పరిధిలోని వెలిమినేడు, చిట్యాల, గుండ్రంపల్లి ప్రాంతాల్లో ఉన్న మూడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఈ సీజన్‌లో ఇప్పటివరకు 900 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు సరఫరా చేసినట్లు వెల్లడించారు. అదనంగా గ్రోమోర్ సెంటర్లు, ప్రైవేట్ డీలర్ల ద్వారా మరో 300 మెట్రిక్ టన్నులు అందించామని తెలిపారు. మండలానికి ఇంకా 300 మెట్రిక్ టన్నుల అవసరం ఉన్నప్పటికీ, 500 మెట్రిక్ టన్నుల వరకు అదనపు సరఫరా కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. యూరియా అందుబాటులోకి వచ్చిన వెంటనే వాట్సాప్ రైతు గ్రూపుల ద్వారా సమాచారం అందజేస్తామని తెలిపారు. యూరియా యాప్ వినియోగంపై సూచనలు రైతులు తప్పనిసరిగా “యూరియా యాప్” ద్వారా బుకింగ్ చేసుకుని సంబంధిత డీలర్ల వద్ద ఎరువులు పొందాలని సూచించారు. ఈ విధానం వల్ల పారదర్శకత పెరిగి, యూరియా పక్కదారి పడకుండా నివారించవచ్చని పేర్కొన్నారు. యాప్ వినియోగంపై సందేహాలుంటే వ్యవసాయ విస్తరణ అధికారులు లేదా పిఎసిఎస్ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. పంటలకు ఎరువు మోతాదుపై సూచనలు ప్రస్తుతం వరి పంట పొట్ట దశలోకి ప్రవేశిస్తున్నందున ఎకరానికి 35 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్ కలిపి వేయాలని తెలిపారు. అధిక మోతాదులో యూరియా వాడితే పంటకు నష్టం కలుగుతుందని హెచ్చరించారు. రైతులు ఆందోళన చెందకుండా, ప్రభుత్వం సూచించిన విధానాన్ని అనుసరించి ఎరువులు కొనుగోలు చేయాలని మండల వ్యవసాయ అధికారి కోరారు. #Chityal #Nalgonda #UreaSupply #AgricultureNews #FarmersUpdate Follow us on Website Facebook Instagram YouTube