BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 16 March 2026, 05:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఒకేసారి బిడ్డలకు జన్మనిచ్చిన తల్లీ కూతుళ్లు

అంతర్జాతీయం అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Mar, 2026 - 05:13 PM
178 వీక్షణలు

తల్లి కావడం ప్రతి మహిళ జీవితంలో అత్యంత ఆనందకరమైన క్షణం. ఒక బిడ్డ పుట్టినా కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. అలాంటిది ఒకే ఇంట్లో తల్లి, కూతురు ఇద్దరూ ఒకేసారి తల్లులు కావడం అరుదైన ఘటనగా మారింది.

ఈ సంఘటన ఇటలీ దేశంలోని నేపుల్స్ నగరంలోని ఒక పెద్ద ఆసుపత్రిలో జరిగింది. మారా బారోన్ అనే మహిళకు 15 ఏళ్ల వయసులోనే కూతురు పాలా జన్మించింది. అప్పట్లో గర్భస్రావం చేయించుకోవాలని కొందరు సూచించినప్పటికీ, ఆమె తన గర్భాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంది.

సంవత్సరాలు గడిచిన తర్వాత ఆశ్చర్యకరంగా తల్లి మారా, కూతురు పాలా ఇద్దరూ ఒకే రోజున బిడ్డలకు జన్మనిచ్చారు. మారా 3.8 కిలోల బరువున్న ఆడబిడ్డకు జన్మనివ్వగా, 21 ఏళ్ల వయసున్న పాలా 3.4 కిలోల బరువున్న మగబిడ్డకు జన్మనిచ్చింది.

ఇద్దరికీ సాధారణ ప్రసవాలే జరిగాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తల్లి, కూతురు మరియు ఇద్దరు నవజాత శిశువులు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని చెప్పారు.

ఒకే కుటుంబంలో తల్లి, కూతురు ఒకే రోజున బిడ్డలకు జన్మనివ్వడం చాలా అరుదైన ఘటనగా వైద్యులు పేర్కొన్నారు. ఇద్దరు చిన్నారుల రాకతో ఆ కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది.