BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 18 March 2026, 08:16 am
Posted by : బోధపల్లి వేణు

పాలకుర్తి నియోజకవర్గంలో వైద్య సదుపాయాల అభివృద్ధిపై చర్చ

తెలంగాణ
/ జనగామ
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
18 Mar, 2026 - 08:16 AM
123 వీక్షణలు

కొడకండ్ల ఆసుపత్రిని 30 పడకలుగా అప్‌గ్రేడ్ చేయాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విజ్ఞప్తి

పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి హైదరాబాద్‌లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గంలో ఆరోగ్య సదుపాయాల మెరుగుదల కోసం తీసుకోవాల్సిన చర్యలను ఎమ్మెల్యే వివరించారు. ముఖ్యంగా కొడకండ్ల మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రస్తుతం కేవలం 7 పడకలతో మాత్రమే సేవలందిస్తోందని, పెరుగుతున్న జనాభా మరియు రోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దాన్ని 30 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.

ఈ మార్పు వల్ల స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు తగ్గుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఎమ్మెల్యే విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ సంబంధిత అధికారులతో చర్చించి ఆసుపత్రి అప్‌గ్రేడేషన్‌కు అవసరమైన చర్యలు తీసుకుంటామని, మంజూరుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మంత్రి దామోదర్ రాజనర్సింహకు కృతజ్ఞతలు తెలిపారు.