BREAKING
thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి thumb తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం thumb చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb గుడిపాల మండలం లో విషాదం thumb గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి thumb తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం thumb చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb గుడిపాల మండలం లో విషాదం thumb గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి....
Date of Publish : 12 September 2026, 02:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Sep, 2026 - 02:34 PM
13 వీక్షణలు

హైదరాబాద్: అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో అమెరికా పర్యటన అనంతరం తిరిగి వచ్చిన ఝాన్సీ రాజేందర్ రెడ్డికి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, కాంగ్రెస్ పార్టీ బలోపేతం, పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు ముఖ్యమంత్రితో చర్చించారు.

పాలకుర్తి నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.