BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 03 June 2026, 04:26 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోలీసులు వాహనాన్ని ఆపినప్పుడు వాహనదారుల హక్కులు ఇవే..!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 04:26 PM
172 వీక్షణలు

రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని ఆపితే చాలామంది ఆందోళనకు గురవుతుంటారు. అయితే చట్టం ప్రకారం పోలీసులకు ఉన్న అధికారాలతో పాటు వాహనదారులకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి.

వాహనాన్ని ఆపిన అధికారి యూనిఫాంలో ఉండటంతో పాటు నేమ్ ట్యాగ్ ధరించి ఉండాలి. ఒకవేళ యూనిఫాంలో లేకపోతే గుర్తింపు కార్డు చూపించాలని అడిగే హక్కు వాహనదారుడికి ఉంటుంది. ట్రాఫిక్ ఉల్లంఘనలపై జరిమానా విధించినప్పుడు అధికారులు తప్పనిసరిగా అధికారిక రసీదు ఇవ్వాలి. రసీదు లేకుండా నగదు చెల్లించాల్సిన అవసరం లేదు.

డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్, పీయూసీ వంటి పత్రాలను తప్పనిసరిగా ఒరిజినల్ రూపంలో వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. డిజీలాకర్ లేదా ఎం-పరివాహన్ యాప్‌లో ఉన్న డిజిటల్ పత్రాలను చూపించినా చెల్లుబాటు అవుతాయి. వాటిని ట్రాఫిక్ పోలీసులు అంగీకరించాలి.

వాహనదారుడిని ఆపినప్పుడు కారణం ఏమిటో అడిగే హక్కు కూడా ఉంటుంది. చలానా లేదా ఉల్లంఘనకు సంబంధించిన వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో వాహనదారులు కూడా పోలీసులకు సహకరించడం, అవసరమైన పత్రాలు చూపించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తమ బాధ్యతగా గుర్తుంచుకోవాలి.

చట్ట నిబంధనలపై పూర్తి అవగాహన ఉండటం వల్ల అనవసర ఇబ్బందులు, అపోహలు, వివాదాలను నివారించవచ్చని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.