BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ప్రైమరీ స్కూల్ ని ఆకస్మిక తనిఖీ చేసిన బొమ్మలరామారం సర్పంచ్

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
25 Mar, 2026 - 07:13 AM
192 వీక్షణలు

ప్రైమరీ స్కూల్ ని ఆకస్మిక తనిఖీ చేసిన బొమ్మలరామారం సర్పంచ్ కట్ట ఉమాదేవి శ్రీకాంత్ గౌడ్

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో  ప్రత్యేక దృష్టి పెట్టాలని బొమ్మలరామారం సర్పంచ్ కట్ట ఉమాదేవి శ్రీకాంత్ గౌడ్ అన్నారు.మంగళవారం రోజున బొమ్మలరామారం సర్పంచ్ కట్ట ఉమాదేవి శ్రీకాంత్ గౌడ్ మండల కేంద్రంలోని ప్రైమరీ పాఠశాల ను ఆకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్నం భోజనం పథకం కింద విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ఈ సందర్భంగా  సర్పంచ్ కట్ట ఉమాదేవి శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ  విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను స్వయంగా పరిశీలించారు. అలాగే పప్పులు, బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను పరిశీలించారు. అన్నం సరిగ్గా అవ్వకపోతే వెంటనే సంబంధిత ఏజెన్సీకి తెలియజేసి బియ్యం మార్చుకోవాలని సూచించారు. నాణ్యత ప్రమాణాల్లో ఎటువంటి రాజీ ఉండకూడదని సంబంధిత సిబ్బందికి  సూచించారు. విద్యార్థులకు సరిపడా భోజనం, పాలు సరైన పరిమాణంలో ఇస్తున్నారా అని అడిగి తెలుసుకొని సమయానికి విద్యార్థులకు ఇవ్వాలన్నారు. వంటగదిలో తయారైన అన్నం, కూరల నాణ్యతను కూడా క్షుణ్ణంగా పరిశీలించి, శుభ్రతతో పాటు రుచికరమైన ఆహారం విద్యార్థులకు అందించాలన్నారు. పాఠశాల పరిసరాల్లో పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని అన్నారు.ఈ తనిఖీలో ఉప సర్పంచ్ ఎల్లబోయిన జంగయ్య,వార్డ్ మెంబర్లు,  భైరబోయిన మల్లేష్, పండుగ రామకృష్ణ, బర్రె ప్రబి త రాజు, బండి సంధ్య నవీన్ గౌడ్, జూపల్లి సునీత విజయరాములు, రాంపల్లి సంతోష ప్రవీణ్ గౌడ్, గ్రామపంచాయతీ కార్యదర్శి హనుమంతు ,పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.