BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 16 May 2026, 05:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రైవేట్ ఆసుపత్రి బిల్లు కట్టలేదని డెడ్ బాడీని ఆపినా.. డిశ్చార్జ్ నిరాకరించినా.. అది నేరమే!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 May, 2026 - 05:13 PM
183 వీక్షణలు

ప్రైవేట్ ఆసుపత్రి బిల్లు కట్టలేదని డెడ్ బాడీని ఆపినా.. డిశ్చార్జ్ నిరాకరించినా.. అది నేరమే!

అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లిన ప్రజలు భారీ వైద్య బిల్లులతో ఇబ్బందులు పడుతున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. కొన్నిచోట్ల బిల్లు పూర్తిగా చెల్లించలేదనే కారణంతో రోగిని డిశ్చార్జ్ చేయకుండా ఆపడం, మరణించిన వ్యక్తి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా నిరాకరించడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. అయితే చట్టం ప్రకారం ఇవి తీవ్రంగా తప్పు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి వ్యక్తికి గౌరవప్రదమైన జీవితం, గౌరవప్రదమైన మరణ హక్కు ఉంది. బిల్లు బాకీ ఉందనే కారణంతో మృతదేహాన్ని నిలిపివేయడం ఈ హక్కుకు విరుద్ధమని పలు హైకోర్టులు, సుప్రీంకోర్టు స్పష్టం చేశాయి. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ ప్రకారం కూడా రోగిని లేదా మృతదేహాన్ని కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా ఆసుపత్రిలో నిర్బంధించరాదు. బిల్లు పెండింగ్‌లో ఉన్నా ఆసుపత్రి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాల్సిందే. బకాయిల వసూలు కోసం ఆసుపత్రి సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చు కానీ శవాన్ని తాకట్టు పెట్టుకోలేదు. అలాగే కుటుంబ సభ్యులు రోగిని మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని లేదా డిశ్చార్జ్ చేయాలని కోరితే, బిల్లు పేరుతో వారిని బలవంతంగా ఆపడం చట్టరీత్యా తప్పు. ప్రతి ఖర్చుకు సంబంధించిన ఐటమ్-వైజ్ బిల్లు, రసీదులు ఇవ్వడం ఆసుపత్రి బాధ్యత. మరణించిన వ్యక్తి పార్థివ దేహానికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఆసుపత్రిపైనే ఉంటుంది. ఇలాంటి ఘటనలు ఎదురైతే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు, పోలీసులకు లేదా హ్యూమన్ రైట్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.