BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 25 March 2026, 09:38 am
Posted by : ఉపారపు లక్ష్మణ్

ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ, డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
25 Mar, 2026 - 09:38 AM
196 వీక్షణలు

ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ, డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలి: డీటీఎఫ్ జిల్లా కార్యదర్శి నీలం సంపత్

ఎండపల్లి, జగిత్యాల జిల్లా:

ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ (PRC) మరియు డీఏ (DA) బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (DTF) జిల్లా కార్యదర్శి నీలం సంపత్ డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో వెల్గటూర్ మరియు ఎండపల్లి మండలాల డీటీఎఫ్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల పరిశీలకులుగా రవీందర్ రెడ్డి, ఎన్నికల అధికారిగా నీలం సంపత్ వ్యవహరించారు.

​ఈ సందర్భంగా నీలం సంపత్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పోరాడటమే కాకుండా, సామాజిక బాధ్యతతో పనిచేసే సంఘం డీటీఎఫ్ అని పేర్కొన్నారు. ప్రభుత్వ పాలనలో ఉద్యోగులది క్రియాశీలక పాత్ర అని, అటువంటి వారిని ప్రభుత్వం చిన్నచూపు చూడటం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను విడుదల చేయకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు అధిక నిధులు కేటాయిస్తూ, మౌలిక వసతులు కల్పించి విద్యారంగ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

​అనంతరం వెల్గటూర్ మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు:

​అధ్యక్షులు: సాగర్

​ప్రధాన కార్యదర్శి: సిహెచ్ మహేష్

​ఉపాధ్యక్షులు: గంగన్న, రమాదేవి, గంగరాజు

​కార్యదర్శులు: సతీష్, శ్రీనివాస్, రమేష్

​ఆడిట్ కమిటీ కన్వీనర్: వెంకటేశ్వర్లు

​కార్యవర్గ సభ్యులు: ఉషా కిరణ్, ప్రవళిక, అనిత

​జిల్లా కౌన్సిల్ సభ్యులు: మల్లయ్య, సత్తయ్య, సురేంద్ర స్వామి, సంపత్

​ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొని నూతన కమిటీకి అభినందనలు తెలిపారు.