BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 20 March 2026, 06:31 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలి

తెలంగాణ
/ నిజామాబాద్
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
20 Mar, 2026 - 06:31 PM
173 వీక్షణలు

ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలి: మోపాల్ పోలీస్ స్టేషన్ తనిఖీలో సీపీ పి. సాయి చైతన్య ఐపీఎస్

నిజామాబాద్: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్ గారు శుక్రవారం మోపాల్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

​ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డుల నిర్వహణ, ఫిర్యాదుల పరిష్కార తీరు, భద్రతా చర్యలు మరియు సిబ్బంది పనితీరును సీపీ సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది ప్రజలతో మరింత స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. శాంతి భద్రతలను కట్టుదిట్టంగా నిర్వహిస్తూ, ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

​అనంతరం పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన బొలెరో వాహనం, పెట్రోలింగ్ వాహనాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాల్లో ఉండే ఫస్ట్ ఎయిడ్ కిట్ సామాగ్రిని తనిఖీ చేసిన ఆయన, వాహనాలను ఎల్లప్పుడూ మంచి కండిషన్‌లో ఉంచుకోవాలని సిబ్బందికి తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని సీపీ పేర్కొన్నారు.

​ఈ తనిఖీలో నిజామాబాద్ సౌత్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఎస్. సురేష్ కుమార్, ఎస్సై జెడ్. సుస్మిత మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.