BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 14 February 2026, 03:50 am
Posted by : NTODAY NEWS OFFICIAL

శ్రీశైలంలో ప్రశాంతంగా మహాశివరాత్రి దర్శనాలు

తెలంగాణ
14 Feb, 2026 - 03:50 AM
327 వీక్షణలు
  శ్రీశైలంలో ప్రశాంతంగా మహాశివరాత్రి దర్శనాలు – ఎస్పీ సునీల్ షొరాణ్ NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట భద్రతా మరియు సౌకర్యాల ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు. స్వామి, అమ్మవార్ల దర్శనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. దేవస్థాన కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు. నిన్న ఒక్కరోజే సుమారు 84,000 మంది భక్తులు దర్శనం చేసుకోగా, వీరిలో 32,543 మంది శివస్వాములు ఉన్నారని వెల్లడించారు. భారీ రద్దీ ఉన్నప్పటికీ ఎలాంటి అంతరాయం లేకుండా దర్శనం కల్పించినట్లు చెప్పారు. అటవీ మార్గం (కైలాస మార్గం) ద్వారా వేలాదిగా పాదయాత్రికులు తరలివస్తున్నారని, వారికి తాగునీరు, భోజన వసతులు, తాత్కాలిక విశ్రాంతి కేంద్రాలు, వైద్య శిబిరాలు, పార్కింగ్ సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. మహాశివరాత్రి రోజున జరిగే పాగాలంకరణ కార్యక్రమం నేపథ్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నామని చెప్పారు. సీసీ కెమెరాల ద్వారా క్షేత్ర పరిసరాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తున్నారని ఎస్పీ వివరించారు. -జిల్లా పోలీస్ కార్యాలయం, నంద్యాల #Srisailam #Mahashivaratri2026 #NandyalPolice #TempleSecurity #DevoteesSafety #CrowdManagement #AndhraPradesh #SpiritualNews Follow us on Website Facebook Instagram YouTube