BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 04 January 2026, 09:29 am
Posted by : NTODAY NEWS OFFICIAL

రాబోయే మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం

తెలంగాణ
04 Jan, 2026 - 09:29 AM
324 వీక్షణలు

రాబోయే మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం

-రాయికల్ పట్టణంలో బీఆర్‌ఎస్ నేతల పాల్గొనడం NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ రాయికల్ పట్టణంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ పాల్గొన్నారు. పట్టణ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ— గ్రామ పంచాయతీగా ఉన్న రాయికల్‌ను మున్సిపాలిటీగా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు. బీఆర్‌ఎస్ పాలనలో మంజూరైన రూ.25 కోట్ల నిధులతోనే ఇప్పటివరకు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైనా ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా కొనసాగాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, అమలు చేయని హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కలిసి పనిచేసి రాయికల్ పట్టణంలోని 12 వార్డుల్లో బీఆర్‌ఎస్ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఎలిగేటి అనిల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు మరంపెల్లి రాణి, సాయి కుమార్, ఉదయశ్రీ లింగన్న, మాజీ కౌన్సిలర్లు తురగ శ్రీధర్ రెడ్డి, సాయి కుమార్, సువర్ణ శ్రీరాములు, సత్యనారాయణ, మహేష్ గౌడ్, మాజీ కో-ఆప్షన్ సభ్యులు వనిత, గణేష్, సోహెల్‌తో పాటు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube