BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 15 February 2026, 02:56 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

ఈ నెల 16న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ

తెలంగాణ
15 Feb, 2026 - 02:56 PM
307 వీక్షణలు
ఈ నెల 16న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున నంద్యాల జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ నెల 16 (సోమవారం)న ప్రత్యేక వేదిక నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు. నంద్యాల జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల, డివిజన్ కేంద్రాలు మరియు మున్సిపల్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రజలు తమ అర్జీలను సంబంధిత కార్యాలయాల్లో ప్రత్యక్షంగా సమర్పించవచ్చని పేర్కొన్నారు. అలాగే అర్జీలను ఆన్లైన్‌లో meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. అర్జీ పరిష్కార స్థితి వివరాలను అదే వెబ్‌సైట్‌లో లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1100 ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించారు. అర్జీదారులు ముందుగా తమ మండల, డివిజన్ లేదా మున్సిపల్ కార్యాలయాల్లో సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని, అక్కడ పరిష్కారం కాని అంశాలకే జిల్లా కేంద్ర వేదికకు హాజరుకావాలని సూచించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే కార్యక్రమానికి సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. #PublicGrievance #MeeKosam #NandyalDistrict #APGovernment #CitizenServices Follow us on Website Facebook Instagram YouTube